కలం, పెద్దపల్లి : మహమ్మద్ ప్రవక్త జీవితం యావత్తు మానవజాతికి ఆదర్శమని మజ్లిస్ తహఫుజ్ ఖత్మె నబువ్వత్ ట్రస్ట్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ముప్తి మహమ్మద్ ఘియాస్ మొహియుద్దీన్ అన్నారు. రబివుల్ అవ్వల్ మాసం సందర్భంగా మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం పట్టణంలోని చింతలవాడ క్రిస్టల్ గెస్ట్ హౌస్ లో సఫాబైతుల్ మాల్ పెద్దపల్లి జిల్లాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర పై టాలెంట్ టెస్ట్ (Talent Test) నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి దాదాపు 200మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముప్తి ఘియాస్ మొహియుద్దీన్ మాట్లాడుతూ.. సఫా బైతుల్ మాల్ పెద్దపల్లి శాఖ ఆధ్వర్యంలో ప్రతిఏటా మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రను రాబోయే తరాలకు, యువతకు తెలపాల్సిన బాధ్యతను విద్యార్థుల మేదస్సు పెంచేందుకు సీరతున్నబి టాలెంట్ టెస్ట్ నిర్వహించడం అభినందనీయమని మౌలాన ఇంతియాజ్ ఖాన్ అసాధిని అభినందించారు. వారసత్వంగా మహమ్మద్ ప్రవక్త జీవితాన్ని భవిష్యత్తు తరాలకు చెప్పాల్సిన బాధ్యత ప్రతి ముస్లింపై ఉందన్నారు.
నేటి కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ యుగంలో యువత, విద్యార్థులు పెడదారిన పట్టకుండా, చెడు వ్యసనాల బారిన పడకుండా మహమ్మద్ ప్రవక్త జీవిత సూత్రాలు చెప్పారనిన్నారు. వాటిని కుల, మతాలకు అతీతంగా తెలియజేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందన్నారు. టాలెంట్ టెస్ట్ రాసిన విద్యార్థులకు త్వరలో బహుమతులు ప్రదాన కార్యక్రమం ఉంటుందన్నారు. ఈకార్యక్రమంలో ముఫ్తి షఫీక్, మౌల్వి ఫైజాన్, మౌలాన సాబీర్ ఆలం, హాఫిజ్ ఆమెర్, ఖత్మె నబువ్వత్ కరీంనగర్ కార్యకర్తలు కలీమ్ షరీఫ్, ముఖర్రం, మహమ్మద్ రఫీ, హాఫిజ్ అబ్దుల్ రాఫె తదితరులు పాల్గొన్నారు.

