కలం, సోన్: సోన్ మండలం గాంధీనగర్(Gandhinagar) గ్రామంలో మణికంఠ యూత్ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని గ్రామంలో వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రతిరోజూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా గ్రామంలోని పేద కుటుంబానికి చెందిన ఇద్దరు వికలాంగులకు రెండు జతల దుస్తులు, నిత్యావసర సరుకులు, బియ్యం అందించారు. ఆపదలో ఉన్న కుటుంబానికి తమ వంతు సహాయం అందించిన మణికంఠ యూత్ సభ్యులను గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎల్లప్ప, రాజ్‌కుమార్, సాయిలు, ప్రవీణ్, ముక్తానందతో పాటు మణికంఠ యూత్ సభ్యులు పాల్గొన్నారు.

