దివ్యాంగుల‌తో బీజేపీ అసెంబ్లీ ముట్ట‌డి!

క‌లం, వెబ్ డెస్క్‌: తెలంగాణ బీజేపీ (BJP) నేడు అసెంబ్లీ ముట్ట‌డికి పిలుపునిచ్చింది. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్యే పాయ‌ల్ శంక‌ర్ ప‌లువురు దివ్యాంగుల‌తో క‌లిసి వ‌చ్చి అసెంబ్లీ ముట్ట‌డికి య‌త్నించారు. దివ్యాంగుల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించాల‌ని డిమాండ్ చేశారు. ఎన్నిక‌ల ముందు హామీ ఇచ్చిన విధంగా పెన్ష‌న్ పెంపు అమ‌లు చేయాల‌న్నారు. అసెంబ్లీ వ‌ద్ద‌కు ర్యాలీగా వ‌చ్చిన బీజేపీ నేత‌లు, దివ్యాంగుల‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ర్యాలీతో అసెంబ్లీ ప‌రిస‌రాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. పోలీసులు నిర‌స‌న‌కారుల‌ను అదుపులోకి తీసుకొని ట్రాఫిక్‌ను క్లియ‌ర్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>