Mobile Popup Ad
Mobile Popup Ad

గాంధీచౌక్ లో చర్చకు సిద్ధమా..? : అరవింద్ కు పీసీసీ చీఫ్ సవాల్​

కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కు టీపీసీసీ చీఫ్ (TPCC Chief) మహేష్​​ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహేష్​​ కుమార్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏడేళ్లలో ఎంపీగా నిజామాబాద్ కు అరవింద్ చేసిన అభివృద్ధి ఏంటి అని ప్రశ్నించారు. నిజామాబాద్ గాంధీచౌక్ లో చర్చకు సిద్ధమా అని చాలెంజ్ చేశారు. రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి తాను వివరిస్తానని చెప్పారు.

ఏడేళ్లలో తెచ్చిన నిధులు, చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ బెడదలేదని స్పష్టం చేశారు. నిజామాబాద్ లో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ గెలుచుకుని మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నామని మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief) ధీమా వ్యక్తంచేశారు. నిజామాబాద్ (Nizamabad) నగరం అభివృద్ధి జరగాలనే ఆకాంక్ష ప్రజల్లో బలంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

Read Also: ముప్పై ఏళ్ల సర్వీసు.. మూటలుగా అక్రమ ఆస్తులు!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>