కలం, వెబ్ డెస్క్: ఏపీలో నాలుగు రాజ్యసభ (Rajya Sabha) సీట్ల కోసం నేతలు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. టీడీపీ నుంచి ముగ్గురు, జనసేన నుంచి ఒకరు పెద్దల సభకు ఎంపిక కాబోతున్నారు. కూటమిలో మరో పార్టీ బీజేపీ రాజ్యసభ సీటు అడగొద్దని ముందే నిర్ణయించుకుంది. జనసేన నుంచి పారిశ్రామికవేత్త లింగమనేని రమేశ్ పేరు దాదాపు ఖరారు అయినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు, బండారు నరసింహారావు కూడా పోటీలో ఉన్నప్పటికీ.. పవన్ మాత్రం రమేశ్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
టీడీపీలో ఎవరికీ అవకాశం దక్కుతుందో..?
టీడీపీ నుంచి ముగ్గురు రాజ్యసభకు (Rajya Sabha) వెళ్లబోతున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సానా సతీశ్‌కు మరోసారి అవకాశం ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. మిగతా రెండు స్థానాల కోసం కిలారు రాజేష్, భాష్యం రామకృష్ణ, గల్లా జయదేవ్, కంభంపాటి రామ్మోహన్, టీడీ జనార్దన్, రెడ్డెప్పగారి శ్రీనివాస్ రెడ్డి, వర్ల రామయ్య, షరీఫ్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. సామాజిక వర్గాల ప్రాధాన్యం మేరకు కమ్మ, కాపు, బీసీ, ఎస్సీలకు నాలుగు రాజ్యసభ సీట్లు దక్కే అవకాశం ఉంది.
Read Also: పర్యావరణ దినోత్సవం: చంద్రబాబు సైకిల్ సవారీ!
Follow Us On : WhatsApp

