బిస్లెరి నీళ్లలో క్యాన్సర్ కారకాలు.. FSSAI వార్నింగ్!

కలం, వెబ్ డెస్క్: బిస్లెరి కంపెనీ నీళ్లలో (Bisleri Water) క్యాన్సర్ కారకాలున్నట్లు తేలడం సంచలనంగా మారింది. బిస్లెరి ఇంటర్నేషనల్ ప్రాంగణం నుంచే తీసుకున్న FSSAI నీటి శాంపిల్స్‌ను తీసుకుని పరీక్షించగా.. అనేక విషయాలు వెల్లడయ్యాయి. బ్రోమేట్, పాలీన్యూక్లియర్ అరోమాటిక్ హైడ్రోకార్బన్లు పరిమితికి మించి ఉన్నట్లు గుర్తించారు. ఇవి రెండూ క్యాన్సర్ కారకాలే అని స్పష్టం చేశారు. ఆహార భద్రతా చట్టం-2006 ప్రకారం ఈ నీళ్లు ఎంత మాత్రం సురక్షితం కాదని FSSAI హెచ్చరించింది.

మొదటిసారి పరీక్షలు చేసినప్పుడు బ్రోమేట్ కారకాలున్నట్లు వచ్చాయి. దీన్ని రెఫరల్ ల్యాబ్‌లో కంపెనీ అప్పీల్ చేయగా.. మరోసారి అదే ఫలితం రావడంతో మరిన్ని పరీక్షలు చేయాలని FSSAI భావిస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా నిబంధనలు పాటించని కంపెనీపై ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని బిస్లెరి కంపెనీ కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>