భర్తను వదిలి ప్రియుడి చెంతకు: హైకోర్టు కీలక తీర్పు!

కలం, వెబ్ డెస్క్​ : మధ్యప్రదేశ్ (Madhya Pradesh) హైకోర్టు ఇటీవల ఒక వివాహానికి సంబంధించిన పిటిషన్ విచారణలో కీలక తీర్పును వెలువరించింది. తన భార్యను ఒక వ్యక్తి అపహరించాడని, ఆమెను తన వద్దకు చేర్చాలని కోరుతూ ఒక భర్త దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై న్యాయస్థానం స్పందించింది. అయితే ఈ కేసులో భర్తకు నిరాశే ఎదురైంది.

విచారణలో భాగంగా సదరు వివాహిత కోర్టు ముందు హాజరై తన వాంగ్మూలాన్ని వినిపించింది. తన భర్తకు, తనకు మధ్య వయస్సులో చాలా వ్యత్యాసం ఉందని, ఆ కారణంగానే తమ వైవాహిక జీవితంలో సంతోషం లేదని ఆమె తెలిపింది. తాను తన ఇష్టపూర్వకంగానే ప్రియుడితో వెళ్తున్నానని, ఎవరూ తనను అపహరించలేదని ఆమె కోర్టుకు విన్నవించింది.

మహిళ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ఆమె మేజర్ అని గుర్తించింది. భారత రాజ్యాంగం ప్రకారం ఒక వయోజనురాలు తన జీవిత భాగస్వామిని లేదా ఎవరితో కలిసి ఉండాలో నిర్ణయించుకునే పూర్తి స్వేచ్ఛను కలిగి ఉంటుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఆమె మైనర్ కాకపోవడంతో, ఆమె ఇష్టానుసారమే ప్రియుడితో కలిసి వెళ్లేందుకు అనుమతినిస్తూ హైకోర్టు ఈ సంచలన తీర్పును ఇచ్చింది.

Read Also: సామాన్యులకు ఊరట.. RBI కీలక నిర్ణయం

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>