కలం, వెబ్‌డెస్క్: వృద్ధాప్యంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వాటిలో వినికిడి లోపం (Hearing loss) అతిపెద్ద సమస్య. ఇది కేవలం ఒకరి వినికిడి సామర్థ్యాన్ని తగ్గించడమే కాదు వారి ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఈ వినికిడి లోపం వల్ల చాలా మంది ఇతరులతో మాట్లాడటానికి ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇప్పుడు వస్తున్న హైటెక్ హియరింగ్ ఎయిడ్స్ (Hearing Aids) ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపుతున్నాయి. మరి భారతదేశంలో అందుబాటులో ఉన్న టాప్ 7 హియరింగ్ ఎయిడ్స్ మోడల్స్ వాటి ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
1. సిగ్నియా ప్యూర్ ఛార్జ్ అండ్ గో IX
ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో పనిచేస్తుంది. చుట్టుపక్కల వచ్చే గోలని తగ్గించి, ఎదుటివారు మాట్లాడే మాటలను చాలా స్పష్టంగా వినిపిస్తుంది. బ్యాటరీ మార్చే పని లేకుండా రీఛార్జ్ చేసుకునే సౌకర్యం ఉండటం వృద్ధులకు చాలా ప్లస్ పాయింట్.
2. ఫోనాక్ ఆడియో లూమిటీ
ఇది మనం ఎక్కడున్నామో గుర్తించి, ఆ ప్రాంతానికి తగ్గట్లుగా సౌండ్‌ను మార్చుకుంటుంది. రద్దీగా ఉండే ప్రదేశాల్లో కూడా మాటలు క్లియర్‌గా వినిపిస్తాయి. దీనికి ఉన్న యూనివర్సల్ బ్లూటూత్ వల్ల దాదాపు అన్ని స్మార్ట్‌ఫోన్లకు సులభంగా కనెక్ట్ అవుతుంది.
3. ఒటికాన్ రియల్ & ఓపెన్ ఎస్
మెదడు శబ్దాలను ఎలా గ్రహిస్తుందో అలాగే ఇది పనిచేస్తుంది. అందుకే దీన్ని వాడితే సహజమైన ధ్వని విన్నట్లు ఉంటుంది. ఎక్కువ సేపు పెట్టుకున్నా తలనొప్పి రాకుండా, చెవులకు సౌకర్యంగా ఉంటుంది.
4. స్టార్కీ లివియో ఎడ్జ్ ఏఐ
టెక్నాలజీని ఇష్టపడే వృద్ధులకు ఇది బెస్ట్. ఇందులో కేవలం వినికిడి ఫీచర్లు మాత్రమే కాకుండా, హెల్త్ ట్రాకింగ్, ఒకవేళ పొరపాటున కింద పడిపోతే ఇతరులకు సమాచారం అందించే ‘ఫాల్ డిటెక్షన్’ వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి.
5. వైడెక్స్ మోమెంట్ & ఎవోక్
డిజిటల్ శబ్దాల్లో వచ్చే చిన్న పాటి ఆలస్యం (Delay) కూడా లేకుండా, అసలైన ధ్వనిని ఇది అందిస్తుంది. పాటలు వినడానికి, టీవీ ప్రోగ్రామ్స్ చూడటానికి ఇది అద్భుతమైన ఎంపిక.
6. జీఎన్ రీసౌండ్ నెక్సియా & ఓమ్నియా
బయట తిరిగే అలవాటు ఉన్నవారికి ఇది బాగుంటుంది. గాలిలో వచ్చే శబ్దాలను, బయట వచ్చే ఇతర అరుపులను ఇది అద్భుతంగా ఫిల్టర్ చేస్తుంది. సోషల్ లైఫ్ ఎక్కువగా గడిపేవారికి ఇది సరిగ్గా సరిపోతుంది.
7. ఫిలిప్స్ హియర్ లింక్ మినీ రైట్
బడ్జెట్‌లో ఉంటూ, సింపుల్‌గా ఉండే డివైజ్ కావాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. తక్కువ నిర్వహణ ఖర్చుతో వృద్ధులకు సులభంగా అర్థమయ్యే కంట్రోల్స్ ఇందులో ఉంటాయి.
మార్కెట్లో ఇన్ని రకాల ఆప్షన్లు ఉన్నప్పటికీ, వృద్ధులు తమ వినికిడి స్థాయిని బట్టి, ఆడియాలజిస్ట్ సలహాతో సరైన పరికరాన్ని ఎంచుకోవడం మంచిది. సరైన హియరింగ్ ఎయిడ్‌ను వాడటం ద్వారా వృద్ధులు ఇతరులతో ఆత్మీయంగా మాట్లాడటమే కాకుండా ఆత్మవిశ్వాసంతో జీవించగలరు.

