కలం, సినిమా : మెగా హీరో సాయి దుర్గ తేజ్(Sai Durgha Tej) తన కెరీర్‌లో మరో క్రేజీ ప్రాజెక్టు అనౌన్స్ చేశారు. గతంలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘క’ సినిమాతో తమ టాలెంట్ ప్రూవ్ చేసుకున్న దర్శకులు సుజీత్, సందీప్(Sujith, Sandeep) కాంబినేషన్‌లో సాయి దుర్గ తేజ్ తన 19వ సినిమా(SDT 19) చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి (Sahu Garapati) నిర్మిస్తున్నారు. ఇది ఒక పీరియాడిక్ మిస్టిక్ థ్రిల్లర్ అండ్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కనుంది.
‘యుగాల రహస్యాలు.. ఊహకందని శక్తి’ అంటూ మేకర్స్ రిలీజ్ చేసిన స్పెషల్ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే రోహిత్ కేపీ దర్శకత్వంలో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్-థ్రిల్లర్ ‘సంబరాల యేటి గట్టు’ మూవీ శర వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాదే గ్రాండ్ రిలీజ్ కానుంది. త్వరలోనే మేకర్స్ విడుదల తేదీని ప్రకటించనున్నారు.

