నీటితొట్టిలో పడి చిన్నారి మృతి

కలం, మెదక్ బ్యూరో: మెదక్ (Medak) జిల్లా చిన్నశంకరంపేట్ మండలం మాందాపూర్ తండాలో విషాద‌క‌ర ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. ఏడాదిన్న‌ర వ‌య‌సు గల చిన్నారి ప్ర‌ణ‌య‌శ్రీ గురువారం రాత్రి నీటితొట్టిలో పడి మృతి చెందింది. ఇంటి ఆవరణలో ఆడుకుంటుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగింది. నీటి తొట్టిలో పాప‌ తలకిందులుగా పడిపోవ‌డంతో ఊపిరి ఆడక మృతి చెందింది. ఆ స‌మ‌యంలో చిన్నారి తండ్రి ప్రసాద్, తల్లి తిరుమలమ్మ ఇంట్లో పనుల్లో నిమగ్న‌మై ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ప్రణయ కదలికల‌ను గ‌మ‌నించ‌క‌పోవ‌డంతో దుర్ఘటన జరిగింది. పాప మృతితో మాందాపూర్ తండాలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>