Mobile Popup Ad
Mobile Popup Ad

మొదటి 3 నెలల్లో శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే?

కలం, వెబ్ డెస్క్: ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్ని నిండిపోయి వెలుపల క్యూలైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీనివాసుడిని 68,445 మంది భక్తులు దర్శించుకున్నారు. శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.79 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఐసీసీ (ICC) ఏర్పాటుతో క్యూలైన్ మేనేజ్మెంట్ సులభతరంగా మారాయి. దీంతో స్వామివారికోసం భక్తులు వేచి ఉండే సమయం తగ్గింది. ఫలితంగా దర్శనం చేసుకునే భక్తుల సంఖ్య పెరిగింది. మొదటి 3 నెలల్లో శ్రీవారిని 65 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. మొదటి 3 నెలల్లో (జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలు) హుండీ ద్వారా వచ్చిన ఆదాయం రూ.356 కోట్లు అని టీటీడీ (TTD) స్పష్టం చేసింది.

 

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>