Mobile Popup Ad
Mobile Popup Ad

శ్రీవారి భక్తులకు అలర్ట్.. జూన్ నెల దర్శన కోటా టికెట్లు విడుదల

కలం, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. జూన్ నెలలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి (Lord Venkateswara) వారిని దర్శించుకోవాలనుకునే వారి కోసం టీటీడీ (TTD) టికెట్ల విడుదలకు సంబంధించి కీలక ప్రకటన ను జారీ చేసింది. వివిధ రకాల దర్శన కోటాలు మరియు సేవా టికెట్ల విడుదలకు సంబంధించి తేదీలను తెలిపింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:

టికెట్ల షెడ్యూల్ ఇలా..

మార్చి 21 (మధ్యాహ్నం 3 గంటలకు): వర్చువల్ సేవలకు సంబంధించిన దర్శన కోటాను టీటీడీ తన అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయనుంది.
మార్చి 23 (ఉదయం 10 గంటలకు): అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటా విడుదల.
మార్చి 23 (ఉదయం 11 గంటలకు): శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు విడుదల.
మార్చి 23 (మధ్యాహ్నం 3 గంటలకు): వయోవృద్ధులు, దివ్యాంగులు మరియు దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి సంబంధించిన ఉచిత ప్రత్యేక దర్శన కోటా విడుదల.
మార్చి 24 (ఉదయం 10 గంటలకు): రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల.
మార్చి 24 (మధ్యాహ్నం 3 గంటలకు): తిరుమల మరియు తిరుపతిలో గదుల బుకింగ్ కోటా టికెట్స్ విడుదల చేస్తారు.

భక్తులకు విజ్ఞప్తి

భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకుని, టికెట్ల కోసం కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఫేక్ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>