Mobile Popup Ad
Mobile Popup Ad

జీవన్‌రెడ్డి ఆవేదనను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం: శ్రీధర్‌బాబు

కలం, వెబ్ డెస్క్: తాను పార్టీ మారతానన్న కాంగ్రెస్‌ నేత జీవన్‌రెడ్డి(Jeevan reddy)తో మంత్రుల సమావేశం ముగిసింది. ఈ మేరకు జీవన్‌రెడ్డితో మంత్రులు శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సమావేశమయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ ఆదేశాలతో శనివారం మంత్రులు జగిత్యాలలోని ఆయన ఇంటికి వెళ్లారు. జీవన్‌రెడ్డిని బుజ్జింగించేందుకు మంత్రులు గంటకుపైగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రుల ఎదుట పార్టీలో గౌరవం దక్కటం లేదని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన.. మంత్రులతో తన భావోద్వేగాన్ని పంచుకున్నారు. సమావేశానంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. జీవన్‌రెడ్డి ఆవేదనను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. జీవన్‌రెడ్డిని కలవటానికి జగిత్యాల వచ్చినట్లు చెప్పారు. జీవన్‌రెడ్డి పద్దతి గల నాయకుడిగా 4 దశాబ్దాలుగా పార్టీలో ఉన్నారని గుర్తు చేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకుల మనోభాలను జీవన్ రెడ్డి తెలియజేశారని చెప్పారు. జీవన్‌రెడ్డితో అనేక అంశాల గురించి చర్చించామన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>