Mobile Popup Ad
Mobile Popup Ad

తిరుమలలో భారీ క్యూలైన్లు.. దర్శనానికి 18 గంటల సమయం

కలం, వెబ్ డెస్క్ : తిరుమలలో (Tirumala) పెద్ద ఎత్తున భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెట్లు నిండి వెలుపల ఉన్న శిలాతోరణం దాకా భక్తులు లైన్ లో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతుందని టీటీడీ చెబుతోంది. సమ్మర్ సెలవులు కావడంతో శ్రీవారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. నిన్న ఒక్కరోజే 86,091 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 29,664 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. రూ.4.21 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్టు టీటీడీ నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులకు పరీక్షలు అయిపోవడంతో పెద్ద ఎత్తున దర్శనానికి తరలి వస్తున్నారని సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>