Mobile Popup Ad
Mobile Popup Ad

పశ్చిమాసియా యుద్ధంపై WHO తీవ్ర ఆందోళన

కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియా యుద్ధం అత్యంత భయంకరమైన స్థాయికి చేరుకుందని WHO తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తాజగా మాట్లాడుతూ.. పశ్చిమాసియా యుద్ధం అణు విధ్వంసం వైపు దారి తీస్తోందని.. ఇది ప్రపంచ మానవాళి ఆరోగ్యానికే ప్రమాదం అని చెప్పారు. ప్రస్తుతానికి రేడియేషన్ లీకేజీ లాంటి ప్రమాదం కనిపించట్లేదని.. కానీ అమెరికా 48 గంటల్లో హర్మూజ్ ను ఓపెన్ చేయకపోతే భీకర దాడులు చేస్తానని చెప్పిన నేపథ్యంలో.. యుద్ధం ఎటువైపు దారి తీస్తుందో అని టెడ్రోస్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇరు పక్షాలు శాంతించాలని.. లేదంటే ఇది మానవాళికే ముప్పు అని చెప్పారు. అణ్వాయుధ కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడం ప్రపంచాన్ని ప్రమాదంలో పడేస్తుందన్నారు. ఈ విషయంపై చర్చలతోనే విజయం సాధిస్తారని.. అందరూ శాంతితో యుద్ధానికి ముగింపు పలకాలని ఆయన తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>