శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం

కలం, వెబ్ డెస్క్: ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం ఉదయం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. శ్రీనివాసుడి సర్వదర్శనానికి 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సోమవారం శ్రీవారిని 91,478 మంది భక్తులు దర్శించుకుకోగా.. 32,376 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5.04 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమలలో సోమవారం లడ్డు ప్రసాదాల విక్రయాలు 4.15 లక్షలుగా ఉన్నాయి.

Read Also:  దేశానికి ఎల్ నినో టెర్రర్.. లోటు వర్షపాతం!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>