తిరుమల కేక్ కటింగ్ వివాదం: దువ్వాడ సంచలన వ్యాఖ్యలు !

కలం, వెబ్​ డెస్క్​ : తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగిన పుట్టినరోజు వేడుకల వివాదం ఇప్పుడు టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు వర్సెస్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ (Duvvada Srinivas)గా మారింది. దివ్వెల మాధురి, తనూజలపై చర్యలు తీసుకోవాలని టీటీడీ యంత్రాంగం పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఒక వీడియోను విడుదల చేస్తూ చైర్మన్‌ను నిలదీశారు.

తిరుమలలో జరిపిన పుట్టినరోజు వేడుకల్లో ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని దువ్వాడ తెలిపారు. ఆ వేడుకలో కట్ చేసింది గుడ్డు వాడనటువంటి కేక్ (ఎగ్​ లెస్​ కేక్​) అని ఆయన వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇటీవల వైరల్ అయిన రాసలీలల వీడియోలను ప్రస్తావిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియోల్లో ఎలాంటి తప్పు లేదని బిఆర్ నాయుడు చెబుతున్నప్పుడు, తిరుమలలో జరిపిన పుట్టినరోజు వేడుకల్లో మాత్రం తప్పు ఏ విధంగా కనిపిస్తుందని ఆయన ప్రశ్నించారు. చైర్మన్ వైఖరిని తప్పుబడుతూ దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>