Mobile Popup Ad
Mobile Popup Ad

ఇరాన్ యుద్ధ నౌక‌కు భార‌త్ ఆశ్ర‌యం!

క‌లం, వెబ్ డెస్క్‌: ఇరాన్‌ (Iran)పై ఇజ్రాయెల్, అమెరికా ద‌ళాలు దాడులు కొన‌సాగిస్తున్నాయి. అవ‌కాశం ఉన్న ప్ర‌తి చోటా డ్రోన్ల‌తో విరుచుకుప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలో భార‌త్ ఓ ఇరానియన్ యుద్ధ నౌక‌ (Warship)కు ఆశ్రయమిచ్చింది. ప్ర‌స్తుతం కొచ్చి ఓడరేవులో ఓ ఇరాన్‌ యుద్ధ నౌక వ‌చ్చి చేరింది. ఇటీవ‌ల ఇంట‌ర్నేష‌న‌ల్‌ ప్లీట్ కోసం విశాఖ‌కు వ‌చ్చిన యుద్ధ నౌక‌ ఐరిస్ దేనాను అమెరికా స‌ముద్రంలో ధ్వంసం చేసిన విష‌యం తెలిసిందే.

ఇదే స‌మ‌యంలో ఐరిస్ లావ‌న్ (IRIS Lavan) అనే నౌక కూడా విశాఖకు వ‌చ్చింది. తిరుగు ప్ర‌యాణంలో ఇరాన్‌పై యుద్ధం ప్రారంభ‌మైంది. దీంతో ఫిబ్ర‌వ‌రి 28న ఐరిస్ లావ‌న్ భార‌త్‌ను ఆశ్ర‌యం కోసం అభ్య‌ర్థించింది. మార్చి 1న భార‌త్ ఐరిస్ లావ‌న్‌కు ఆశ్ర‌యం ఇచ్చేందుకు అంగీక‌రించింది. మార్చి 4న ఐరిస్ దేనా సముద్రంలో మునిగిపోగా, అదే రోజు ఐరిస్ లావ‌న్‌ కొచ్చికి చేరుకుంది. ఈ యుద్ధ నౌక‌లోని (Iran Warship) 183 మంది సిబ్బందికి కొచ్చి నావల్ బేస్‌లో ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేసింది.

 Read Also: గద్దర్ ఫిల్మ్ అవార్డులు: డిప్యూటీ సీఎం వద్దకు తుది జాబితా

Follow Us On: X(Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>