నేడు అద్భుత ఘట్టం.. శ్రీవారి చక్రస్నాన మహోత్సవం

కలం, వెబ్ డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో వైభవోపేతంగా సాగుతున్నశ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు (Tirumala Brahmotsavam) చివరిదశకు చేరుకున్నాయి. లక్షలాది భక్తులు తిరుమలకు చేరుకొని బ్రహ్మోత్సవాలను తిలకిస్తున్నారు. తిరుమాడ వీధుల్లో విద్యుత్ దీప కాంతుల్లో విహరిస్తున్న కలియుగ ప్రత్యక్ష దైవాన్ని కనులారా దర్శించి పునీతులవుతున్నారు. సెప్టెంబర్ 15న మొదలైన ఉత్సవాలు.. బుధవారంతో ముగియనున్నాయి.

ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించిన తరువాత శ్రీవారి పుష్కరిణిలో ఉత్సవమూర్తికి చక్రస్నానం ఘట్టం నిర్వహిస్తారు. శ్రీవారి చక్రస్నాన వైభవం అత్యంత విశిష్టదిగా పండితులు చెబుతారు. స్వామివారి చక్రస్నాన క్రతువును చూసినంత మాత్రాన స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని భక్తుల విశ్వాసం. స్వామి పుష్కరిణిలో పవిత్ర చక్రస్నానం తర్వాతనే బ్రహ్మోత్సవాలు ముగిస్తాయి.

తొలిరోజు ధ్వజారోహణంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు.. చివరి రోజుసైతం ధ్వజారోహణంతోనే ముగుస్తాయి. బుధవారం రాత్రి ధ్వజావరోహణ కార్యక్రమం పండితులు నిర్వహించనున్నారు. ఇక గురువారం నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 4 గంటల నుంచి తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>