epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

తిలక్ వర్మ్‌ను ఆ స్థానంలో ఆడించాలి: ఇర్ఫాన్ పఠాన్

వన్డేల్లో తిలక్ వర్మ(Tilak Varma)ను ఏ స్థానంలో ఆడించాలి? అన్న అంశం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా దీనిపై స్పందించిన టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్(Irfan Pathan).. తిలక్ వర్మను 4 స్థానంలో బరిలోకి దించాలని సూచించాడు. ఆసియా కప్ ఫైనల్‌లో తిలక్ వర్మ్.. నాలుగో స్థానంలోనే మైదానంలో అడుగు పెట్టాడని, కానీ చిచ్చరపిడుగులా ఆడి టీమ్‌కు విజయాన్ని కట్టబెట్టాడని గుర్తు చేశాడు. నవంబర్‌ 30 నుంచి దక్షిణాఫ్రికాతో మూడు వన్డేలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే బీసీసీఐ(BCCI) ప్రకటించిన 15 మంది జట్టులో చోటు దక్కిన ఆటగాళ్లపై ఇర్ఫాన్ తన అభిప్రాయాలను వెల్లడించాడు.

మెడ గాయంతో శుభ్‌మన్ గిల్.. వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. దీంతో వన్డేల్లో భారత జట్టు పగ్గాలను కేఎల్ రాహుల్ చేపట్టనున్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత రిషభ్‌ పంత్‌ మళ్లీ వన్డే జట్టులోకి వచ్చాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసే శ్రేయస్‌ అయ్యర్‌ గాయం కారణంగా అందుబాటులో లేడు. దీంతో జట్టులో తిలక్ వర్మకు స్థానం దక్కింది. దీనిపై ఇర్ఫాన్ స్పందించాడు.

తిలక్‌ వర్మ వన్డేల్లో కూడా అద్భుత ప్రదర్శన ఇవ్వగలడని అన్నాడు. ఆసియా కప్‌ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై టీమ్‌ సాధించిన విజయంలోకీలక పాత్ర పోషించాడని గుర్తు చేశాడు. టీ20ల్లో అతడు మూడో స్థానంలో బాగా రాణించగల సామర్థ్యం ఉన్నా, వన్డేల్లో నాలుగో స్థానంలో అతడు మరింత సరిపోయే ఆటగాడని అభిప్రాయపడ్డాడు. మొదట క్రీజులో నిబద్ధతగా నిలబడతాడని, ఒత్తిడిని ఎదుర్కొంటూ పరుగులు చేస్తాడని కొనియాడాడు. వికెట్ల మధ్య పరుగులు తీయడంలో కూడా అతడు చాలా చురుకైనవాడని వివరించాడు ఇర్ఫాన్(Irfan Pathan).

భారత వన్డే జట్టు: రోహిత్‌ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్‌ కోహ్లి, తిలక్‌ వర్మ, కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), రిషభ్‌ పంత్, వాషింగ్టన్‌ సుందర్, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, హర్షిత్‌ రాణా, రుతురాజ్ గైక్వాడ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్‌, ధ్రువ్‌ జురెల్‌.

Read Also: జీహెచ్ఎంసీ నేతలతో కేటీఆర్ కీలక సమావేశం

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>