epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

టీమిండియాకు భారీ ఎదురు దెబ్బ.. తిలక్ వర్మకు సర్జరీ!

కలం, వెబ్​ డెస్క్​ : టీ20 ప్రపంచకప్ 2026కు ముందు భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మ (Tilak Varma) టెస్టిక్యులర్ టార్షన్ సమస్యతో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ తరఫున ఆడుతున్న సమయంలో జనవరి 8న తీవ్ర కడుపునొప్పితో రాజ్‌కోట్ ఆస్పత్రికి తరలించగా తక్షణ ఆపరేషన్ అవసరమని వైద్యులు తేల్చారు. శస్త్రచికిత్స విజయవంతమైనా పూర్తిగా కోలుకోవడానికి రెండు నుంచి నాలుగు వారాలు పట్టే అవకాశముందని సమాచారం.

దీంతో ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే ప్రపంచకప్‌లో అతడి భాగస్వామ్యం అనిశ్చితంగా మారింది. ఈ గాయంతో జనవరి 21 నుంచి న్యూజిలాండ్‌తో జరిగే ఐదు టీ20ల సిరీస్‌కు తిలక్ దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆసియా కప్ 2025 ఫైనల్‌లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు కప్ అందించిన తిలక్ ఇప్పటివరకు 37 ఇన్నింగ్స్‌లలో 1,183 పరుగులు సాధించాడు. సగటు 49.29, స్ట్రైక్ రేట్ 144.09తో అతడి ప్రదర్శన అభిమానుల హృదయాలను గెలిచింది.

ప్రత్యేకత ఏంటంటే అతడి అన్ని టీ20 హాల్ఫ్ సెంచరీలు చేజ్‌ లలోనే రావడం. తిలక్ గైర్హాజరీతో మిడిల్ ఆర్డర్‌లో భారత్ మరోసారి మార్పులు చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. ప్రత్యామ్నాయంపై జట్టు మేనేజ్‌మెంట్ త్వరలో నిర్ణయం తీసుకోనుంది. వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్న Tilak Varma త్వరగా మళ్లీ మైదానంలోకి రావాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>