కలం, వెబ్ డెస్క్: యువ క్రికెటర్ తిలక్ వర్మ, ప్రముఖ నటి శ్రీలీల (Sreeleela) మధ్య డేటింగ్ ఉందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ విషయమై ఆమె తల్లి స్వర్ణలత స్పందించారు. శ్రీలీలను క్రికెటర్‌తో ముడిపెడుతూ వస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం శ్రీలీల తన సినిమా కమిట్‌మెంట్‌లతో పాటు వైద్య విద్యపైనే పూర్తి దృష్టి సారిస్తోందని, బిజీ షెడ్యూల్ వల్ల ఆమెకు ఇలాంటి వాటిపై ఆలోచించే సమయం లేదని చెప్పారు. తన ఖాళీ సమయాన్ని చదువు కోసమే కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు.
శ్రీలీలపై డేటింగ్ (Dating) రూమర్స్ రావడం కొత్తేమీ కాదు. గతంలో బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్‌తో బంధం ఏర్పడిందంటూ సోషల్ వార్తలొచ్చాయి. ఇద్దరి నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో రూమర్స్‌కు చెక్ పడ్డాయి. టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న శ్రీలీల, సినిమాలతోనే కాకుండా వ్యక్తిగత జీవితం పరంగానూ నిరంతరం వార్తల్లో నిలుస్తున్నారు. తరచుగా ఆన్‌లైన్ గాసిప్‌లకు కేంద్రబిందువుగా మారుతోంది.

