కమల్ హాసన్–శివకార్తికేయన్ కాంబో ‘సెయోన్’ షూటింగ్ ప్రారంభం

కలం, సినిమా : మోస్ట్ అవేటెడ్ కాంబినేషన్ చిత్రంగా తెరకెక్కుతున్న ‘సెయోన్’ (Seyon) షూటింగ్ ఈరోజు (మే 18) అధికారికంగా  ప్రారంభమైంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై విశ్వ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) నిర్మిస్తున్నారు. ఇందులో హీరోగా శివకార్తికేయన్ (Sivakarthikeyan) నటిస్తున్నారు. ‘అమరన్’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత కమల్ హాసన్–శివకార్తికేయన్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో ప్రేక్షకులలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి శివకుమార్ మరిముత్తు దర్శకత్వం వహిస్తుండగా, క్యూట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. కల్కి ఫేమ్ సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ‘వన్ విజన్.. వన్ జర్నీ’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ‘సెయోన్’ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అభిమానులు ఈ కాంబినేషన్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>