కలం, వెబడెస్క్: మీ ముఖం ఎంత తెల్లగా, అందంగా ఉన్నా.. మీ పెదవులు నల్లగా ఉంటే మీ అందం మొత్తం మసకబారిపోతుంది. చాలా మంది తమ పెదవుల నలుపును చూసి ఎంతో ఆందోళన పడుతుంటారు. చాలామందికి సిగరెట్లు తాగకపోయినా పెదాలు నల్లగా మారిపోతుంటాయి. దీంతో వీరు నలుగురిలో నవ్వడానికి, ఫోటోలు తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు.
అయితే పెదాలు నల్లబడటానికి చాలా కారణాలు ఉంటాయి. ఎండలో ఎక్కువగా తిరగడం, శరీరంలో నీటి కొరత, ఎక్కువ టీ లేదా కాఫీ తాగడం, నాణ్యతలేని లిప్‌స్టిక్‌లు వాడటం వంటి కారణాలు కూడా ఉండొచ్చు. అయితే ఎటువంటి కెమికల్స్ వాడకుండా కేవలం మీ వంటింట్లో ఉండే సహజసిద్ధమైన వస్తువులతోనే, కేవలం కొద్ది రోజుల్లోనే మీ నల్లటి పెదవులను సాఫ్ట్‌గా, పింక్ కలర్‌లోకి మార్చుకోవచ్చు లిప్ కేర్ టిప్స్ (Lip Care Tips) ఎంటోతెలుసుకుందామా?
నల్లటి పెదాలకు గులాబీ రంగులోకి మార్చే వంటింటి చిట్కాలు
తేనె – నిమ్మరసం
ఒక చెంచా తేనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని పెదవులకు రాయాలి. 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల పెదాల నల్లదనం తగ్గుతుంది.
షుగర్ స్క్రబ్
కొద్దిగా చక్కెరలో తేనె లేదా ఆలివ్ ఆయిల్ కలిపాలి. ఈ మిశ్రమాన్ని పెదాలపై మెల్లగా రుద్దాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే పెదాలు మృదువుగా మారుతాయి.
బీట్‌రూట్ జ్యూస్
రాత్రి పడుకునే ముందు బీట్‌రూట్ జ్యూస్‌ను పెదవులకు రాసుకుని ఉదయాన్నే కడిగేయాలి. ఇది సహజమైన గులాబీ రంగును ఇవ్వడంలో సహాయపడుతుంది.
కొబ్బరి నూనె
పెదాలు పొడిబారకుండా ఉండేందుకు కొబ్బరి నూనె బాగా ఉపయోగపడుతుంది. రాత్రి పడుకునే ముందు కొద్దిగా స్వచ్ఛమైన కొబ్బరి నూనెను పెదవులకు రాసుకొని, సున్నితంగా మసాజ్ చేసి రాత్రంతా అలాగే వదిలేయాలి. ఇది పెదాలను తేమగా ఉంచి నల్లటి మచ్చలు తగ్గించడంలో సహాయపడుతుంది.
పాటించాల్సిన జాగ్రత్తలు
- రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి.
- బయటకు వెళ్లే ముందు SPF(Sun Protection Factor) ఉన్న లిప్‌బామ్ వాడాలి.
- రాత్రి పడుకునే ముందు లిప్‌స్టిక్ పూర్తిగా తొలగించాలి.
- పెదాలను నాలుకతో తడపడం మానేయాలి.
పెదాలు ఒక్కసారిగా చాలా నల్లగా మారినా, దురద లేదా వాపు వచ్చినా వెంటనే చర్మవ్యాధి నిపుణులను సంప్రదించడం మంచిది. సరైన జాగ్రత్తలు తీసుకుంటే పెదాలు మృదువుగా, అందంగా కనిపిస్తాయని సూచిస్తున్నారు నిపుణులు.

