కలం, వెబ్ డెస్క్ : సిద్ధిపేట (Siddipet) జిల్లాలో పెద్ద పులి సంచారం (Tiger Movement) స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. చిన్నకోడూరు మండలం విఠలాపూర్ గ్రామ పరిసరాల్లో పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు. గ్రామ శివారులోని పంట పొలాల్లో పులి పాదముద్రలను గుర్తించిన అధికారులు, అది పెద్ద పులి అడుగులేనని ప్రాథమికంగా నిర్ధారించారు.
పులి జాడను కనిపెట్టేందుకు అటవీ శాఖ రంగంలోకి దిగింది. డ్రోన్ కెమెరాల సహాయంతో విఠలాపూర్, అటవీ సరిహద్దు ప్రాంతాలలో ముమ్మరంగా గాలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా అటవీ ప్రాంతాలకు, శివారు ప్రాంతాలకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పులిని బంధించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, ఎవరూ ఆందోళన చెందవద్దని వారు భరోసా ఇస్తున్నారు.
Read Also: రేవంత్‌కి అనుకూలంగా పనిచేస్తున్న ఎస్ఈసీ : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Follow Us On: Sharechat


