epaper
Wednesday, February 18, 2026
epaper

అల్లు వారింట మొదలైన పెళ్లి పనులు.. మొదటి వెడ్డింగ్ కార్డ్ ఎవరికంటే?

కలం, సినిమా : అల్లు వారింట పెళ్లి సందడి మొదలైంది. అల్లు శిరీష్ (Allu Sirish), నయనిక (Nayanika) నిశ్చితార్ధం అక్టోబర్‌లో జరిగిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా అల్లు శిరీష్, నయనిక జంట దుబాయ్‌లో ప్రీ వెడ్డింగ్ పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కూడా హాజరవడంతో సోషల్ మీడియాలో ఫోటోస్ బాగా వైరల్ అయ్యాయి.

అల్లు శిరీష్, నయనికల వివాహం మార్చి 6న గ్రాండ్ గా జరుగనుంది. దీనితో ఇటీవల పసుపు కొట్టి పెళ్లి పనులు మొదలు పెట్టినట్లు అల్లు శిరీష్ వెల్లడించారు. తాజాగా పెళ్లి పిలుపులు కూడా మొదలు అయ్యాయి. అల్లు శిరీష్ తన పెళ్లి మొదటి పత్రికను తల్లి నిర్మల, తండ్రి అల్లు అరవింద్‌తో కలిసి  మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), సురేఖ (Surekha) దంపతులకు అందజేశారు. చిరంజీవి సంతోషంగా ఆహ్వాన పత్రికను అందుకొని అల్లు శిరీష్‌ను (Allu Sirish) ఆశీర్వదించారు.

Read Also: ‘పెద్ది’ సెట్స్‌లో బుచ్చిబాబు బర్త్ డే వేడుకలు.. ఫోటోస్ వైరల్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>