Mobile Popup Ad
Mobile Popup Ad

మళ్ళీ పాక్‌కు నో హ్యాండ్​షేక్​..

కలం, వెబ్​డెస్క్​: టీ20 వరల్డ్‌కప్ వేదికగా భారత్–పాకిస్థాన్ (IND vs PAK) మ్యాచ్ మొదలయ్యేలోపే మరోసారి హ్యాండ్‌షేక్ (No Handshake) వివాదం తెరపైకి వచ్చింది. ఆదివారం కొంలంబోలో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ టాస్ సమయంలో, భారత కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్, పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. టాస్ గెలిచిన సల్మాన్ అలీ ఆఘా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

అయితే సాధారణంగా జరిగే స్నేహపూర్వక హ్యాండ్‌షేక్ ఈసారి కూడా కనిపించలేదు. దీంతో ఆసియా కప్ నుంచి కొనసాగుతున్న టీమిండియా ‘నో హ్యాండ్‌షేక్’ (No Handshake) విధానం ఈ టోర్నీలోనూ అమలులో ఉందని మరోసారి స్పష్టమైంది. మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన సూర్యకుమార్ (Suryakumar Yadav), జట్టు క్రికెట్ ఆడేందుకు మాత్రమే వచ్చిందని  పేర్కొన్నాడు. మరోవైపు ఆఘా, క్రికెట్ ఆత్మను గౌరవించాలని తన అభిప్రాయం తెలియజేస్తూ, ఈ విషయంలో నిర్ణయం భారత్ చేతుల్లోనే ఉందని వెల్లడించాడు.

Read Also: వారమే గడువు.. పాక్​ సైన్యానికి బీఎల్​ఏ వార్నింగ్​

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>