తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం

కలం, వెబ్ డెస్క్ : తూర్పుగోదావరి (East Godavari) జిల్లాలో పెద్దపులి సంచారం(Tiger Movement) కలకలం రేపుతోంది. కోరుకొండ ప్రాంతంలోకి బెంగాల్ టైగర్ (Bengal Tiger)  మళ్లీ ప్రవేశించడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. పాండవుల మెట్ట ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు గుర్తించిన అటవీ శాఖ అధికారులు, ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా దాని కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పులి కదలికలను ఆధారంగా తీసుకుని అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. అనవసరంగా అటవీ ప్రాంతాల్లోకి వెళ్లొద్దని సూచనలు జారీ చేశారు. పులి సంచారంతో గ్రామీణ ప్రాంత ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ బృందాలు పరిస్థితిని గమనిస్తూ భద్రతా చర్యలు చేపడుతున్నాయి.

Read Also: అజారుద్దీన్ మంత్రిపదవిపై ఉత్కంఠ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>