మా సమస్యలను మీ బాయ్‌ఫ్రెండ్‌కి చెప్పండి!

కలం, వెబ్ డెస్క్: ఇటలీ ప్రధాని జార్జియా మెలోని (Giorgia Meloni) ఇన్‌స్టా పోస్టుపై ఓ నెటిజన్ చేసిన కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ‘స్టూడెంట్ల సమస్యలు వినమని మీ బాయ్‌ఫ్రెండ్‌కు చెప్పండి’ అంటూ ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్య వైరల్‌గా మారడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని మెలోనిల పేర్లను కలిపి ‘మెలోడీ’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కామెంట్ చేయడంతో ఇది కాస్తా చర్చనీయాంశంగా మారింది.

ఈ వ్యాఖ్యపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సరదాకి చేసిన కామెంట్ అని కొందరు అంటుండగా, మెజారిటీ నెటిజన్లు మాత్రం దీనిని తీవ్రంగా తప్పుబడుతున్నారు. అంతర్జాతీయ వేదికలపై విదేశీ నాయకులతో సంబంధం ఉన్న పోస్టుల్లో ఇలాంటి బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేయడం వల్ల విదేశాల ముందు దేశ ప్రతిష్ఠ దెబ్బతింటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దేశ ప్రతిష్ఠను దిగజార్చేలా కామెంట్లు చేయడం సరైంది కాదని వారు హితవు పలుకుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>