కలం, నాగర్ కర్నూల్: ప్రజా సంక్షేమం లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి (MLA Rajesh Reddy) అన్నారు. జిల్లా పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ తో కలిసి నూతన సీసీ కెమెరాల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం బిజినేపల్లిలో చేపల మార్కెట్ ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక ఓటర్ సవరణ సమావేశంలో పాల్గొన్నారు. చేపల మార్కెట్ ప్రారంభంలో, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ జన్మది వేడుకల్లో పాల్గొని కేక్ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మత్స్యకారుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల రక్షణ కోసం పోలీస్ శాఖ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి మీనాక్షి నటరాజన్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజలు ప్రభుత్వానికి, అధికారులకు సహకరించాలని కోరారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడతానని తెలిపారు. ఏ సమస్య ఉన్నా అందుబాటులో ఉండి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ప్రజలకు భరోసా కల్పించారు.

