Mobile Popup Ad
Mobile Popup Ad

యాదాద్రి జిల్లాలో పులి పంజా.. ఆవుపై దాడి

కలం, ఆలేరు: ఆలేరు మండలం శారాజిపేట గ్రామంలో పులి (Tiger) సంచారం కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన దూడల శ్రీధర్‌కు చెందిన పాడి ఆవుపై పులి దాడి చేసి చంపేసింది. ఆవు మెడను కొరికి రక్తం తాగి వెళ్ళిపోయింది ఆవుపై పులి దాడితో గ్రామ రైతులు, పరిసర ప్రాంత గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

కొద్ది రోజులుగా యాదాద్రి జిల్లాలో(Yadadri District) పులి వరుసగా పశువులపై దాడులు చేస్తూ ఫారెస్ట్ అధికారులకు సవాల్ విసురుతోంది. పులిని పట్టుకునే ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ఇకనైనా ఫారెస్ట్ అధికారులు చాకచక్యంగా వ్యవహరించి పులిని బంధించి పశువుల ప్రాణాలను కాపాడాలని రైతులు, గ్రామస్థులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>