లోన్ యాప్ వేధింపుల‌కు మ‌రో యువ‌కుడు బ‌లి..!

క‌లం, వెబ్ డెస్క్‌: లోన్ యాప్ వేధింపుల‌(Loan App Harassment)కు మ‌రో యువ‌కుడు బ‌ల‌య్యాడు. లోన్ క‌ట్ట‌క‌పోతే న్యూడ్ ఫోటోలు అంద‌రికీ షేర్ చేస్తామ‌ని బెదిరించ‌డంతో స‌ద‌రు యువ‌కుడు ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య(Suicide) చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్‌(Hyderabad)లోని ముషీరాబాద్ ప‌రిధిలోని రాంన‌గ‌ర్‌లో చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉండే ప్రేమ్ కుమార్‌ అనే యువ‌కుడు ఓ యాప్‌లో కొంత న‌గ‌దు లోన్ తీసుకున్నాడు. ఇటీవ‌ల ఆర్థిక ఇబ్బందుల‌తో లోన్ ఈఎంఐ రూ.3,000 క‌ట్ట‌లేక‌పోయాడు. దీంతో లోన్ యాప్ నుంచి త‌ర‌చూ ఫోన్ కాల్స్ చేసి వేధించారు. లోన్ క‌ట్ట‌క‌పోతే న్యూడ్ ఫోటోలు నీ కాంటాక్ట్ లిస్ట్‌లోని అంద‌రికీ పంపిస్తామ‌ని బెదిరించారు. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన ప్రేమ్ కుమార్ ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో ఉరి వేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ప్రేమ్ కుమార్ భార్య నాగ‌వేణి చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>