ఘోర ప్రమాదం.. ఆటోను ఢీకొట్టిన డీసీఎం..

కలం, నల్లగొండ బ్యూరో : యదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భువనగిరి – జగదేవ్‌పూర్ హైవేపై వడపర్తి శివారు ప్రాంతంలో ఓ డీసీఎం అతివేగంగా వచ్చి ఆటోను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లితో పాటు అన్నదమ్ములు మృతిచెందారు. తిమ్మాపూర్ కు చెందిన డొంకెన కేతమ్మ తన ఇద్దరు కొడుకుల(నరేష్, సురేష్)తో కలిసి సొంత ఆటోలో భువనగిరికి వెళ్లి సొంతూరికి ప్రయాణిస్తోంది. అయితే వారు ప్రయాణిస్తున్న ఆటో వడపర్తి శివారుకు రాగానే.. ఓ డీసీఎం వెనుక నుంచి అతివేగంగా ఢీకొట్టింది.

ప్రమాద ధాటికి ఆటో నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో డొంకెన నరేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. తల్లి కేతమ్మ తీవ్రంగా గాయపడడంతో హైదరాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందగా, మరో కొడుకు కొడుకు సురేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. చనిపోయిన ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకరు వికలాంగుడు కావడం గమనార్హం. తల్లి, ఇద్దరు కొడుకులు చనిపోవడంతో తిమ్మాపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు డీసీఎం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు.

Read Also: 14న కొండగట్టుకు బండి సంజయ్ పాదయాత్ర..

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>