సిద్దిపేట జిల్లాలో ముగ్గురు కానిస్టేబుల్స్‌పై సస్పెన్షన్ వేటు

కలం మెదక్ బ్యూరో: సిద్దిపేట (Siddipet) జిల్లాలో ముగ్గురు కానిస్టేబుల్స్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ములుగు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఈ కానిస్టేబుల్స్ డ్యూటీలో నిర్లక్ష్యం వహించినందుకు కమిషనర్ చర్యలు తీసుకున్నారు. ఫిబ్రవరి 17న ములుగు అటవీ కళాశాలలో నిర్వహించిన అరణ్య కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ (Konda Surekha)  ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా బందోబస్తు విధుల్లో ఉన్న ముగ్గురు కానిస్టేబుల్స్ సమయానికి హాజరు కాకపోవడంతో ఉన్నతాధికారులు గమనించారు. విధుల పట్ల నిర్లక్ష్యం చూపి ఆలస్యంగా రావడంపై తీవ్రంగా స్పందించిన అధికారులు, వెంటనే వారిపై చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ముగ్గురు కానిస్టేబుల్స్‌ను సస్పెండ్ చేస్తూ సిద్దిపేట (Siddipet) పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్(Rashmi Perumal) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనతో పోలీస్ శాఖలో క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు.

Read Also: కేటీఆర్ డ్రగ్ టెస్టుకు రావాలి.. మండలిలో ఆసక్తికర స్టేట్‌మెంట్

Follow Us On: Facebook

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>