Mobile Popup Ad
Mobile Popup Ad

రాజీనామా చేస్తా అంటూ కేటీఆర్ సంచలన సవాల్ ..!

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో (Telangana Assembly) రెండోరోజు అధికార పార్టీ నేతలు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)  మధ్య వాడీవేడిగా చర్చ జరిగింది. మహిళా సంఘాల రుణాల విషయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేసిన ప్రకటనపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ సంచలన సవాల్ విసిరారు. అసెంబ్లీలో చర్చల సందర్భంగా తమ ప్రభుత్వం మహిళలకు రూ.57వేల కోట్ల వడ్డీలేని రుణాలిచ్చిందని భట్టి విక్రమార్క తెలిపారు.

ఈ వ్యాఖ్యలను కేటీఆర్ (KTR) తీవ్రంగా ఖండించారు. మహిళలకు రూ.57వేల కోట్ల వడ్డీలేని రుణాలిచ్చామని సభలో ఆర్డర్ కాపీని చూపిస్తే తాను తన ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేసేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. అయితే ఆర్డర్ కాపీ చూపించలేకపోతే  తప్పుడు సమాచారం ఇచ్చినందుకుగానూ భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తన డిప్యూటీ సీఎం పదవితోపాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? అంటూ ఛాలెంజ్ చేశారు. దీంతో ఒక్కసారిగా సభ దద్దరిల్లింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

Read Also: చికెన్​ ప్రియులు జాగ్రత్త.. అక్కడంతా కుళ్లిన మాంసమే!

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>