అష్ఠముఖి కోనేరులో శనివారం అమావాస్య స్నానాలు

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా (Nizamabad) ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామశివారులో వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం శనీశ్వర జయంతి శనివారం అమావాస్య వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ విశేష సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణలోని వివిధ జిల్లాల నుండే కాకుండా, పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకల నుండి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దక్షిణ భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధి గాంచిన ఏకైక అష్టముఖీ కోనేరు ఈ ఆలయ ప్రత్యేకత. శనివారం అమావాస్య రోజున వస్తే చాలు వేలాది మంది భక్తులు కోనేరులో పుణ్య స్నానాలు చేస్తారు.

శనివారం అమావాస్యతో పాటు శనీశ్వర జయంతి రావడంతో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్నానాలు ఆచరించారు. అనంతరం లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ విశేషాలు ఉన్న రోజు కోనేరులో స్నానాలు చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. భక్తులు ముందుగా పిల్లలతో సహా కొనేరుకు వచ్చారు. కోనేరు చుట్టూ ఎనిమిది ప్రదక్షిణలు చేశారు. నవ ధాన్యాలు చల్లుతూ ప్రదక్షిణలు చేశారు. అలా చేయడం వల్ల కష్టాలు తొలగుతాయని క్షేమంగా ఉంటామని నమ్మకం.. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ ఇన్ఛార్జ్ కార్యనిర్వహణాధికారి వేణు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>