epaper
Monday, November 17, 2025
epaper

గ్రహణం రోజున ఈ ఆలయాలు మూతబడవు..

గ్రహణం(Eclipse) వస్తుంది అంటే దేశంలోని ప్రముఖ ఆలయాలు సైతం సూతక సమయం వరకు మూతబడతాయి. గ్రహణం పూర్తయిన తర్వాత ప్రత్యేక పూజలు చేసి ప్రధాన అర్చకుడు ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. ఈ విషయాన్ని భక్తులకు కూడా ముందే సమాచారం అందిస్తారు. గ్రహణం ఉన్నందున నిర్ణీత సమయంలో ఆలయాన్ని మూసివేయనున్నామని, భక్తులు సహకరించాలని ఆలయ నిర్వాహకులు కోరతారు. ప్రఖ్యాతి గాంచిన ఆలయాలయితే ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ప్రకటనలు కూడా విడుదల చేస్తాయి. కానీ మన దేశంలో పలు ఆలయాలకు మాత్రం ఈ సూతకం వర్తించదని మీకు తెలుసా. సూతక సమయంలో కూడా ఈ ఆలయాలు తెరిచే ఉండటం కాదు.. పూజలు, దర్శనాలు అన్నీ కూడా యథావిధిగా జరుగుతాయి. మరి ఆ ఆలయాలు ఏవి? ఎక్కడ ఉన్నాయో చూసేద్దాం..

విష్ణు పాద ఆలయం..

గయలోని విష్ణుపాద ఆలయానికి గ్రహణ సూతకం వర్తించదు. గ్రహణ సమయంలో ఈ ఆలయంలో పిండదానం చేయడం మంచిదని నమ్ముతారు. అందుకే గ్రహణం సమయంలో కూడా ఈ ఆలయం తెరిచే ఉంటుంది.

ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం

ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత ఉంది. శివుని 12 జ్యోతిరింగాలలో ఉజ్జయిని ఒకటి. స్వయంభు మహాకాళ రూపంలో ఉన్న శివుడిపై గ్రహణం ప్రభావం ఉండదు. అందుకే గ్రహణ(Eclipse) సమయంలో కూడా ఈ ఆలయం తలుపులు తెలిచే ఉంటాయి.

తిరువర్ప్పు వద్ద శ్రీ కృష్ణ ఆలయం…

కేరళలోని కొట్టాయంలో తిరువర్పులో ఉన్న శ్రీకృష్ణ ఆలయం ఉంది. ఆ ఆలయంలో కృష్ణుడికి రోజుకు పదిసార్లు నైవేద్యం పెడతారు. ఇక్కడ స్వామికి ఆకలి ఎక్కువగా ఉంటుంది. ఆకలి కారణంగా స్వామి విగ్రహం సన్నగిల్లుతుందని నమ్ముతారు. అందువల్ల, గ్రహణ సమయంలోనూ ఈ ఆలయ తలుపులు మూసివేయరు. స్వామికి నైవేద్యాలు సమర్పిస్తూనే ఉంటారు.

కల్కాజీ ఆలయం..

ఈ ఆలయం ఢిల్లీలో ఉంది. కల్గా దేవి కాలచక్రానికి అధిపతి అని నమ్ముతారు. అన్ని గ్రహాలు, నక్షత్రాలు ఆమె గుండా కదులుతాయి. అందువల్ల గ్రహణం ఆమెను ప్రభావితం చేయదని నమ్మకం. అంతేకాకుండా గ్రహణం సమయంలో ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా చేయిస్తారు భక్తులు.

లక్ష్మీనాథ్ ఆలయం

ఈ ఆలయం రాజస్థాన్‌లోని బికనీర్‌లో ఉంది. ఈ ఆలయం కూడా గ్రహణం సమయంలో మూసివేయరు. ఒకసారి గ్రహణ సమయంలో తలుపులు మూసివేసి దేవునికి ఆహారం నైవేద్యం పెట్టలేదట. ఆలయానికి సమీపంలో ఉన్న ఒక దుకాణంలోని మిఠాయి వ్యాపారికి కల వచ్చిందట. కలలో దేవుడు ప్రత్యేక్షమై తనకు ఆకలిగా ఉందని చెప్పాడట. అప్పటి నుంచి గ్రహణాల సమయంలోనూ ఈ ఆలయం తెరిచే ఉంటుంది.

కల్పేశ్వర్..

ఉత్తరాఖండ్‌లోఉన్న కల్పేశ్వర్ ఆలయాన్ని కూడా గ్రహణం సమయంలో తెరిచే ఉంచుతారు. ఈ ఆలయంలోని శివుడు.. గంగామాత ప్రవాహ వేగాన్ని తగ్గించారని అంటారు. అందుకే గ్రహణం సమయంలో కూడా పూజలు యథావిధిగా జరుగుతాయి.

Read Also: శ్రీశైల ఆలయ అభివృద్ధిపై సీఎం సమీక్ష
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>