కలం, వెబ్ డెస్క్: తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ దళపతి విజయ్ (Vijay Thalapathy) నేతృత్వంలోని టీవీకే పార్టీని ఎన్డీఏ కూటమిలోకి చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ కీలక బాధ్యతను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు అప్పగించినట్లు సమాచారం. తన రాజకీయ అనుభవంతో విజయ్‌ను ఒప్పించేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని, పొత్తులో భాగంగా విజయ్‌కు 40 నుండి 50 సీట్లు ఆఫర్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఎన్డీఏతో పొత్తుపై గతంలోనే టీవీకే అధినేత (TVK Vijay) రియాక్ట్ అయ్యారు. తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమని, ఒంటరిగానే పోటీ చేస్తామని విజయ్ ఇదివరకే స్పష్టం చేశారు.
కేవలం వ్యక్తిగత స్నేహం ఉండటంతోనే పవన్-విజయ్ కలిసే అవకాశాలున్నాయిన ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ తదుపరి నిర్ణయం తమిళ రాజకీయాల్లో ఉత్కంఠను రేపుతోంది. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయపరంగా ఎన్డీఏతో మంచి దోస్తీ ఉంది. ఏపీ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి ఘనవిజయానికి పవన్ కళ్యాణ్ ఒక కీలక వారధిగా నిలిచారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేకతను గుర్తించిన ఆయన, ఓట్లు చీలకుండా ఉండాలనే లక్ష్యంతో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య మూడు పార్టీల పొత్తును ఒకే తాటిపైకి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారు.
తన రాజకీయ వ్యూహంతో టీడీపీకి బలం చేకూర్చడమే కాకుండా, జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో 100 శాతం స్ట్రైక్ రేట్‌ను సాధించి ఎన్డీఏ అఖండ విజయానికి బాటలు వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడులో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఏ మేరకు ప్రభావం చూపుతారో వేచి చూడాల్సిందే.
Read Also: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
Follow Us On: Facebook

