రెస్టారెంట్లపై వార్ ఎఫెక్ట్.. గ్యాస్ కొరతతో తీవ్ర ఇబ్బందులు

కలం, వెబ్ డెస్క్ : బెంగళూరు (Bengaluru) నగరంలో రెస్టారెంట్లను నిర్వహిస్తున్న హోటల్స్ అసోసియేషన్ కమర్షియల్ గ్యాస్ కొరత (Gas Shortage) కారణంగా రేపటి నుండి తమ రెస్టారెంట్లను నిర్వహించలేమని తెలిపారు. గ్యాస్ సరఫరా దాదాపు పూర్తిగా ఆగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అసోసియేషన్ వెల్లడించింది. అలాగే హైదరాబాద్ (Hyderabad) నగరంలో హోటల్స్ అసోసియేషన్ అత్యవసర సమావేశం నిర్వహించింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటల్స్‌పై వచ్చే ప్రభావం, భవిష్యత్ ప్రణాళికలను చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. ఇప్పటికే బెంగళూరులో హోటల్స్ యాజమాన్యాలు సమ్మెబాట పట్టగా, సమస్యను కేంద్రానికి తెలియజేసేందుకు చెన్నై (Chennai) హోటల్స్ అసోసియేషన్ లేఖ రాసినట్లు సమాచారం.

Read Also: వాణిజ్య గ్యాస్ స‌ర‌ఫ‌రాపై నిఘా.. ముగ్గురు అధికారుల‌తో క‌మిటీ

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>