కలం, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం సామాన్య వాహనదారులకు మరోసారి షాకిచ్చింది. దేశంలో సీఎన్‌జీ ధరలను (CNG Price Hiked) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా కిలో సీఎన్‌జీపై మరో రూపాయి పెంచినట్లు సమాచారం. గడిచిన కొన్ని రోజుల్లోనే సీఎన్‌జీ ధరలు వరుసగా పెరగడం గమనార్హం. కేవలం రెండు రోజుల క్రితమే పెట్రోల్ ధరల పెంపును సాకుగా చూపుతూ కిలో సీఎన్‌జీపై రెండు రూపాయలు పెంచారు. ఆ భారం నుంచి కోలుకోకముందే, ఇప్పుడు తాజాగా మరో రూపాయి పెంచడంతో వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వరుస ధరల పెరుగుదల ప్రభావం రవాణా రంగంపై తీవ్రంగా పడనుంది. ముఖ్యంగా రోజువారీ ఆదాయంపై ఆధారపడే ఆటో డ్రైవర్లు, క్యాబ్ సర్వీసులు నడిపే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also: నీట్ పేపర్ లీకులపై మోదీ మౌనం వీడాలి: రాహుల్ గాంధీ
Follow Us On: Instagram

