epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

నెలాఖరుకు అసెంబ్లీ సమావేశాలు ?

కలం డెస్క్ : అసెంబ్లీ శీతాకాల (Telangana Assembly Session) సమావేశాలు ఈ నెల చివర్లో నిర్వహించేలా కసరత్తు జరుగుతున్నది. గత సమావేశాలు సెప్టెంబరు 1న ముగిసిన తర్వాత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులను (Legislative Bills) ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. ఇందులో కీలకమైన జీహెచ్ఎంసీ (GHMC) చట్ట సవరణకు సంబంధించినవి రెండు, మున్సిపాలిటీలు/మున్సిపల్ కార్పొరేషన్లకు (Municipal Bodies) సంబంధించి ఒకటి, ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు/నియామకాలకు సంబంధించినవి రెండు, జీఎస్టీ (GST) చట్ట సవరణకు సంబంధించి ఒకటి, మరికొన్ని ఆర్డినెన్సులు (Ordinance) ఉన్నాయి. వీటికి సంబంధించిన బిల్లులను అసెంబ్లీ ముందు ఉంచి ఆమోదం పొందేలా ఈ సెషన్‌లో చర్చలు జరగనున్నాయి. మూడు రోజుల పాటు నిర్వహించే అవకాశాలున్నట్లు సచివాలయ వర్గాల సమాచారం. క్రిస్మస్ పండుగ తర్వాత న్యూ ఇయర్ వచ్చే లోపే సెషన్‌ను కంప్లీట్ చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన.

GHMC చట్ట సవరణపై వాడివేడి చర్చ :

నగర శివారు ప్రాంతాల్లోని ఇరవై మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ గత క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రజల నుంచి అభిప్రాయాల సేకరణ కూడా మొదలైంది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు రెండు రోజుల పాటు పొడిగించాల్సి వచ్చింది. వివిధ మున్సిపల్ బాడీల విలీనం తర్వాత జీహెచ్ఎంసీ విస్తీర్ణం పెరగడంతో కొత్త డివిజన్లను క్రియేట్ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్ వ్యవస్థీకరణ (Reorganisation of GHMC Divisions)పై బీఆర్ఎస్ కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యేలు, లీడర్లు వ్యతిరేకత వ్యక్తం చేశారు. నిర్దిష్టమైన పద్ధతి లేకుండా జరిగిందని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీ సెషన్‌లో జీహెచ్ఎంసీ చట్ట సవరణకు సంబంధించిన రెండు బిల్లులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాడి వేడి వాదనకు దిగే అవకాశమున్నది.

ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయంపైనా :

బీఆర్ఎస్ టికెట్ మీద పోటీ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొంది కాంగ్రెస్‌లో చేరారన్న ఆరోపించిన గులాబీ నేతలు పదిమందిపై అనర్హత వేటు వేయాలని దాఖలు చేసిన పిటిషన్లను స్పీకర్ తిరస్కరించారు. కాంగ్రెస్‌లో చేరినట్లు తగిన ఆధారాలు చూపలేకపోయినందున వారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తామని స్పీకర్ పేర్కొన్నారు. ఈ కారణంగా వారిపై అనర్హత వేటు వేయడం సాధ్యం కాదని, ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారని స్పష్టత ఇచ్చారు. మరో ముగ్గురిపై దాఖలైన పిటిషన్లపైనా గురువారం తీర్పును వెల్లడించనున్నారు. ఈ అంశాన్ని కూడా అసెంబ్లీ సెషన్(Telangana Assembly Session) సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చర్చకు పట్టుబట్టే అవకాశమున్నది. నిరసనలతో పాటు ఆందోళనకు దిగే అవకాశమున్నది.

కొన్ని ఆర్డినెన్సుల వివరాలు :

1. జీహెచ్ఎంసీ చట్ట సవరణ (First Amendment) (మున్సిపల్ బాడీలను విలీనం చేస్తూ…)
2. జీహెచ్ఎంసీ చట్ట సవరణ (Second Amendment) (జీహెచ్ఎంసీ డివిజన్ల రీఆర్గనైజేషన్)
3. తెలంగాణ మున్సిపాలిటీల చట్ట సవరణ (Second Amendment) (ఇంతకాలం మున్సిపల్ బాడీస్‌గా ఉన్నవాటిని రద్దు చేస్తూ జాబితా నుంచి తొలగించడం)
4. తెలంగాణ ఉద్యోగుల చట్ట సవరణ (First Amendment) (నియామకాల నియంత్రణ, సిబ్బంది క్రమబద్ధీకరణ, పే స్ట్రక్చర్ రెగ్యులరైజేషన్)
5. తెలంగాణ జీఎస్టీ చట్ట సవరణ (GST Act Amendment)
6. తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట సవరణ (Panchayatraj Act Amendment) (ఇద్దరికంటే ఎక్కువ మంది సంతానమున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం)

Read Also: అమెరికాకంటే ఇండియా డబుల్.. AI వాడకంలో మనమే టాప్!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>