‘హాయ్ రే’తో మ్యాజిక్ చేసిన థమన్-అనిరుధ్ కాంబో

కలం, సినిమా : టాలీవుడ్‌లో మరో కొత్త సంగీత సంచలనం మొదలైంది. యంగ్ హీరో అనీష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఇట్లు అర్జున’(Itllu Arjuna). ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘హాయ్ రే’(Hai Re) సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మ్యూజిక్ లవర్స్‌ని  విపరీతంగా ఆకట్టుకుంటోంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్వరపరిచిన ఈ పాటకు, రాక్‌స్టార్ అనిరుధ్ తన ఎనర్జిటిక్ వాయిస్‌తో మరో స్థాయికి తీసుకెళ్లారు.

థమన్ అందించిన మెలోడియస్ ట్యూన్‌కు అనిరుధ్ ప్రత్యేకమైన స్టైల్ కలవడంతో ‘హాయ్ రే’ సాంగ్ ఇన్‌స్టెంట్ చార్ట్‌బస్టర్‌గా మారింది. ముఖ్యంగా పాటలో వినిపించే బీట్‌లు, మ్యూజిక్ అరేంజ్‌మెంట్ యూత్‌ని  బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక సంజన ఆలపించిన కర్నాటిక్ క్లాసికల్ వోకల్స్, హర్షవర్ధన్ అందించిన ర్యాప్ బిట్స్ ఈ సాంగ్‌కు ట్రెండీ టచ్ ఇచ్చాయి. ఈ పాటలో హీరోగా నటిస్తున్న అనీష్ తన డ్యాన్స్ మూమెంట్స్‌, ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కొత్త హీరో అయినప్పటికీ స్క్రీన్ ప్రెజెన్స్‌తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు.

ముఖ్యంగా సినిమాలో హీరో మూగ, చెవిటి యువకుడిగా కనిపించనున్న నేపథ్యంలో, హీరోయిన్ అనస్వర రాజన్‌పై అతనికి ఉన్న ‘సైలెంట్ లవ్’ను లిరిసిస్ట్ కళ్యాణ్ చక్రవర్తి ఎంతో హృద్యమైన పదాలతో మలిచారు. ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ మహేష్ ఉప్పల తెరకెక్కిస్తుండగా, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ వెంకీ కుడుముల సమర్పిస్తున్నారు. ఇప్పటికే కాన్సెప్ట్‌, మ్యూజిక్‌, క్యాస్టింగ్‌తో ప్రేక్షకులలో ఆసక్తి పెంచిన ‘ఇట్లు అర్జున’ సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>