కలం, వెబ్ డెస్క్ : వైయస్సార్ (YSR Kadapa) జిల్లా గోపవరం మండలం పిపికుంట సమీపంలో అర్ధరాత్రి వేళ తీవ్ర కలకలం రేగింది. విజయవాడ నుండి కడపకు ప్రయాణికులతో వెళ్తుండగా ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు.
రోడ్డుపై బస్సు ఒక్కసారిగా తిరగబడటంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని 108 వాహనాల్లో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

