కలం, సినిమా : తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) నటించిన “జన నాయకుడు”(Jana Nayakudu) సినిమా మళ్లీ సెన్సార్ చిక్కుల్లో పడింది. శుక్రవారం మద్రాస్ హైకోర్టు క్లియరెన్స్ ఇవ్వడంతో విజయ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. అయితే వెంటనే సీబీఎఫ్‌సీ (CBFC) డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను కోర్టు స్వీకరించడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) కూడా ఇక తమ చేతుల్లో ఏమీ లేదని ఆవేదనను వ్యక్తం చేసింది. విజయ్ సినిమా జన నాయకుడు సెన్సార్ పిటిషన్ పై ఈ నెల 21న కోర్టు హియరింగ్ ఉంది.
విజయ్ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకోవడంతో కార్తీ “వా వాతియార్” (Vaa Vaathiyaar) సినిమా లైన్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. గత డిసెంబర్‌లో ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. తెలుగులో “అన్నగారు వస్తారు” (Annagaru Vostaru) పేరుతో రిలీజ్‌కు రెడీ చేశారు. ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇంటర్వ్యూలతో ప్రచారం నిర్వహించారు. తీరా చివరి నిమిషంలో ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో కోర్టు కేసుతో సినిమా విడుదల ఆగిపోయింది. జన నాయకుడు ఆగిపోయినందున తమిళంలో వా వాతియార్ కు రిలీజ్ స్పేస్ దొరికింది.
దీంతో వా వాతియార్ ను తమిళంతో పాటు తెలుగులో వీలైనంత త్వరలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థలో జ్ఞానవేల్ రాజా (Gnanavel Raja) నిర్మించారు. కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్ గా నటించింది. ఆమెకు ఇది కోలీవుడ్ ఎంట్రీ మూవీ. కల్ట్ డైరెక్టర్ గా పేరున్న నలన్ కుమారస్వామి రూపొందించాడు.
Read Also: రాజాసాబ్‌కు మరో దెబ్బ.. ఆన్‌లైన్‌లో హెచ్‌డీ ప్రింట్!
Follow Us On : WhatsApp


