Mobile Popup Ad
Mobile Popup Ad

ఆఫీసర్ల కమిటీతో ఆర్టీసీ జేఏసీ చర్చలు

కలం, వెబ్ డెస్క్​ : సమ్మె నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నలుగురు ఐఏఎస్ అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీతో ఆర్టీసీ జేఏసీ (TGSRTC JAC) ప్రతినిధులు సచివాలయంలో శుక్రవారం సమావేశమయ్యారు. ఆర్టీసీ జేఏసీ పెట్టిన మొత్తం 32 డిమాండ్లలో ఏకాభిప్రాయం కుదరని మూడు డిమాండ్లపై చర్చలు జరుగుతున్నాయి. తొలుత ఆఫీసర్ల కమిటీతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని జేఏసీ ప్రతినిధులు తేల్చి చెప్పారు. సమ్మె ప్రారంభం కావడానికి ముందే ఆఫీసర్ల కమిటీతో చర్చలు జరిగాయని, ఇరువైపులా ఏకాభిప్రాయం కుదరలేదని, కాలయాపన కోసం జరిపే చర్చలతో సమయాన్ని వృథా చేసుకోదల్చుకోలేదని తేల్చి చెప్పిన జేఏసీ ప్రతినిధులు తాజాగా అదే అంశాన్ని ప్రస్తావించారు.

ఆఫీసర్ల కమిటీతో జరిపే చర్చలు ఎలాంటి ఫలితాలు ఇవ్వవన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌తో మాట్లాడిన తర్వాత ఆఫీసర్ల కమిటీతో చర్చలకు జేఏసీ ప్రతినిధులు సిద్ధమయ్యారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌తో జేఏసీ (TGSRTC JAC) డెలిగేట్స్ భేటీ కానున్నారు. నర్సంపేట్ డ్రైవర్ సూసైడ్ మొదలు సమ్మెలోకి దిగడానికి ప్రభుత్వం ముందు ఉంచిన 32 డిమాండ్లపై చర్చించనున్నారు.

Read Also: బీజేపీలోకి మ‌ల్లారెడ్డి కోడ‌లు.. క్లారిటీ ఇదే!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>