Mobile Popup Ad
Mobile Popup Ad

సంచలనం.. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరు ఇదే ?

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో మరో రాజకీయ పార్టీ ఏర్పాటుకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) శనివారం ( ఏప్రిల్ 25) మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లో జరగనున్న భారీ బహిరంగ సభలో తన కొత్త రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా కవిత కొత్తగా ఏర్పాటు చేయబోయే ఆవిర్భావ సభ ప్రాంగణం వద్ద కీలక విషయం వెలుగులోకి వచ్చింది. సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలపై ‘తెలంగాణ ప్రజావికాస్ సమితి’ అనే బోర్డులు వెలిశాయి. దీంతో ఇదే కవిత కొత్త పార్టీ పేరు అని ప్రచారం జరుగుతోంది.

‘తెలంగాణ ప్రజావికాస్ సమితి’ అనే పేరుతో ఏర్పాటు చేసిన స్వాగత బోర్డులపై తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకలైన గోల్కొండ కోట, కాకతీయ తోరణం చిత్రాలను పొందుపరిచారు. ఇది రాష్ట్ర వారసత్వాన్ని, ప్రజల వికాసాన్ని కాంక్షిస్తూ పెట్టిన పేరుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కవిత (Kalvakuntla Kavitha) కొత్తగా పెట్టబోయే పార్టీ పేరు ఇప్పటివరకు ‘తెలంగాణ ప్రజా జాగృతి’ గా ప్రచారంలో ఉండగా.. ఇప్పుడు అనూహ్యంగా ‘తెలంగాణ ప్రజావికాస్ సమితి’ అనే పేరుతో స్వాగత తోరణాలు వెలుగుచూడడం హాట్ టాపిక్ గా మారింది. అసలు పార్టీ పేరు ఇదేనా? అనే చర్చ జరుగుతోంది. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరు తెలంగాణ ప్రజావికాస్ సమితి(TPS/TVS) అయితే కేసీఆర్ కు బిగ్ షాక్ తగిలినట్లేననే వాదనలు వినిపిస్తున్నాయి. కవిత కొత్త పార్టీ పేరు అటు బీఆర్ఎస్ కు, ఇటు టీఆర్ఎస్ కు దగ్గర ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాగా, కవిత కొత్త పార్టీకి గుర్తుగా ‘ధర్మగంట’ను ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదించినట్లు సమాచారం అందుతోంది.

Read Also: బీజేపీలోకి మ‌ల్లారెడ్డి కోడ‌లు.. క్లారిటీ ఇదే!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>