Mobile Popup Ad
Mobile Popup Ad

ఆర్టీసీ సమ్మె.. కార్మికులకు యాజమాన్యం బహిరంగ లేఖ

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెలో (TGSRTC Strike) పాల్గొన్న నేపథ్యంలో సిబ్బందికి యాజమాన్యం కీలక విజ్ఞప్తి చేసింది. పారిశ్రామిక వివాదాల చట్టం గురించి వివరిస్తూ సిబ్బందికి ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీ వై.నాగిరెడ్డి (MD Nagireddy) బహిరంగ లేఖ రాశారు. మాయ మాటలు నమ్మి సమ్మె కొనసాగించొద్దని కోరారు. ‘ఆర్టీసీ సంస్థ ప్రయాణికుల సేవే పరమావధిగా పనిచేస్తోంది. యూనియన్లు ఇచ్చిన సమ్మె నోటీసులపై యాజమాన్యం ఇప్పటికే కమిటీతో చర్చల ప్రక్రియను ప్రారంభించింది. ఈ తరుణంలో కార్మికులందరూ ముఖ్యమైన అంశాలను గమనించాలని యాజమాన్యం కోరుతోంది’ అని లేఖలో పేర్కొన్నారు.

చట్టపరమైన నిబంధన ప్రకారం సంబంధిత అధికారి వద్ద వివాదం పెండింగ్ లో ఉన్నప్పుడు సమ్మెకు దిగడం చట్టవిరుద్ధం అని పేర్కొన్నారు. ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్న వేళ సమ్మెకు వెళ్లడం చెల్లదన్నారు. సమ్మెలో పాల్గొనడం వల్ల వేతన కోతతో పాటు, ఉద్యోగ నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్చలు తీసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. ఇది కార్మికుల భవిష్యత్తుతో పాటు వారి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని యాజమాన్యం పేర్కొంది.

సంస్థ, కార్మికుల సంక్షేమం దృష్ట్యా చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి యాజమాన్యం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ‘ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా, సంస్థ ప్రతిష్ఠను కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉంది. కార్మికులు, యూనియన్ నాయకులు, పత్రికలు లేదా సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక పిలుపులను నమ్మొద్దు. సమ్మెను (TGSRTC Strike) విరమించుకుని యథావిధిగా తమ విధులకు హాజరు కావాలి’ అని యాజమాన్యం కోరింది.

Read Also: అమ్మవారికి నకిలీ వెండి నాణేలు.. కొత్త మోసం!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>