అమ్మవారికి నకిలీ వెండి నాణేలు.. కొత్త మోసం!

కలం, వెబ్ డెస్క్: వెండి ధరలు పెరుగుతున్న కొద్దీ మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. తాజాగా, జమ్మూ కశ్మీరులోని ప్రఖ్యాత మాతా వైష్ణో దేవి ఆలయంలో (Vaishno Devi Temple) ఇదే తరహా మోసాలు వెలుగు చూశాయి. ఈ గుడికి వచ్చే భక్తులు.. అమ్మవారి లోగోతో ఉన్న వెండి నాణేలను స్థానిక వ్యాపారుల వద్ద కొనుగోలు చేసి హుండీలో వేస్తుంటారు. ఇలా చేయడం వలన తాము కోరిన కోరికలు నెరవేరడంతో పాటు, అంతా మంచే జరుగుతందనేది వారి ప్రగాఢ విశ్వాసం. భక్తుల విశ్వాసాలను సొమ్ము చేసుకునేందుకు కొందరు వ్యాపారులు వారికి నకిలీ వెండి నాణేలు విక్రయిస్తూ.. మోసాలకు పాల్పడుతున్నారు.

ఇలా బయటపడింది..

ఆలయానికి (Vaishno Devi Temple) వచ్చిన వెండి నాణేల ద్వారా సుమారు రూ.550 కోట్లు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా కట్టారు. వీటిని కరిగించడానికి మింట్ కాంపౌండ్ కి తీసుకెళ్లగా.. వీటిలో 20 టన్నులు నకిలీ వెండి నాణేలు అని తేలడంతో అధికారులు షాకయ్యారు. వచ్చిన కానుకల్లో కేవలం 5 నుంచి 6 శాతం మాత్రమే అసలైన వెండి ఉండటంతో, వాటి విలువతో రూ.30 కోట్ల ఆదాయం కూడా దాటడం లేదని వాపోయారు. జింక్, ఐరన్, కాడ్మియం లోహాలకు సిల్వర్ కోటింగ్ చేస్తూ.. భక్తులను మోసం చేస్తున్న వ్యాపారులపై ఇప్పటికే పోలీసులకు పలు ఫిర్యాదులు అందాయి. ఈ విషయం లెఫ్టినెంట్ గవర్నర్ కు సైతం తెలియడంతో విచారణ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Read Also: టాప్ 20 హాటెస్ట్ సిటీల్లో 19 ఇండియాలోనే

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>