కలం, వెబ్ డెస్క్: ఆర్టీసీ కార్మికుల సమ్మెతో తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం సమ్మె ఆపాలని పిలుపునిస్తున్నా.. యాజమాన్యం హెచ్చరిస్తున్నా కార్మికసంఘాలు పెద్దగా స్పందించడం లేదు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. బుధవారం సమావేశమైన ఆర్టీసీ జేఏసీ (TG RTC Strike) ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది.
రేపటి కార్యాచరణ ఇదే..
గురువారం ఉదయం ఉ.5గంటల నుంచి అన్ని డిపోల ఎదుట మహాధర్నాలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం, యాజమాన్యం చర్చల పేరుతో కార్మికులను, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సమస్యలు పరిష్కరించలేమని కమిటీ చేతులెత్తేసిందన్న జేఏసీ ఆరోపిస్తోంది. మొదటి రోజు సమ్మెను విజయవంతం చేసిన కార్మికులకు ధన్యవాదాలు తెలిపింది.
డిమాండ్లు ఇవే..
‘ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి. 30 శాతం తగ్గకుండా 2021 వేతన సవరణ అమలు చేయాలి. హైదరాబాద్‌లో ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను రద్దు చేయాలి. ఇతర జోన్లకు ఉద్యోగులను బదిలీ చేసే ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలి. కార్మిక సంఘాలను పునరుద్ధరించి వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి.’ అంటూ కార్మిక సంఘాలు డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచాయి. సమస్యలు తీరే వరకు వెనకడుగు వేయబోమని ఆర్టీసీ జేఏసీ (TG RTC Strike) స్పష్టం చేసింది.
Read Also: మోదీపై తీవ్ర వ్యాఖ్యలు.. ఖర్గేకు నోటీసులు
Follow Us On: Instagram

