అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు : కలెక్టర్ ప్రతిమ సింగ్

కలం, మెదక్ బ్యూరో : ఆర్టీసీ సమ్మెతో ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని ప్రైవేట్ వాహనదారులు అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని మెదక్ (Medak) కలెక్టర్ ప్రతిమ సింగ్ (Collector Prathima Singh) తెలిపారు. జిల్లా (Medak)లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ఆర్టీసీ సమ్మెతో జిలాల్లో సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కలెక్టర్ దృష్టి పెట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పని చేస్తున్నామని, ఎమర్జెన్సీ అవసరాల కోసం కంట్రోల్ నంబర్ 9391942254 ఏర్పాటు చేశామని ఆమె చెప్పారు.

జిల్లాలోని మెదక్, నర్సాపూర్ బస్ డిపోల నుంచి బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. మెదక్ నుంచి 100, నర్సాపూర్ నుంచి 34 బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు. రెండు బస్ డిపోల పరిధిలో కొత్తగా కండక్టర్‌లను నియమిస్తున్నామన్నారు. అదే విధంగా గతంలో ఆర్టీసీ డ్రైవర్ పోస్టుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వారి సేవలు వినియోగించుకుంటామని చెప్పారు. పోలీస్, రెవెన్యూ, రవాణా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ప్రైవేట్ స్కూల్స్, కంపెనీల వారిని సహకరించాలని, వారి సహకారంతో ప్రజల అవసరాల మేరకు బస్ సౌకర్యం కల్పిస్తామని కలెక్టర్ (Collector Prathima Singh) తెలిపారు.

Read Also: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>